2025 చివరిలో ఉన్నాం. 2026 కి త్వరలో స్వాగతం పలుకనున్నాము. ఇంకా అఖండ 2 లాంటి బడా సినిమాతో పాటు, ఇంకొన్ని చిన్న సినిమాలు రానున్నాయి. తరువాత జనవరి నుంచి కొత్త జర్నీ మొదలు కానుంది. ఈ క్రమంలో 2025 లో గూగుల్ లో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ లో అన్ని భాషల సినిమాలున్నాయి. టాప్ టెన్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ‘సైయారా’ మూవీ. ఆహాన్ పాండే, అవనీత్ పడ్డా నటించిన ఈ మూవీని మోహిత్ సూరి తెరకెక్కించారు. చాలా కాలం తరువాత బాలీవుడ్ కి ఊపిరి పోసింది సైయారా మూవీ. కలక్షన్ల పరంగా, కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అందుకే గూగుల్ లో టాప్ టెన్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాఫ్టర్1’ గూగుల్ లో టాప్ 2 లో నిలిచింది. కాంతారా కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ 735 కోట్ల కలక్షన్లతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టింది.
టాప్ 3 లో రజినీ కాంత్ – లోకేష్ కనక రాజ్ కాంబో మూవీ ‘కూలి’ నిలిచింది. కూలి లో నాగ్ సైమన్ అనే విలన్ రోల్ లో అదరగొట్టారు. అమీర్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అందుకే ఈ మూవీ గూగుల్ లో టాప్ 3 లో నిలిచింది. టాప్ 4 లో ఎన్టీఆర్, హృతిక్ కాంబో మూవీ ‘వార్ 2’ నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు పెంచింది. అందుకే ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసారు. టాప్ 5 లో ‘సనమ్ తేరి కసమ్’ నిలవటం గమనార్హం. కారణం ఈ మూవీ 2016 లో వచ్చింది. హర్ష వర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకెన్ నటించిన ఈ లవ్ స్టోరీ కోసం ఈ ఏడాది ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేయటం విశేషం.
టాప్ 6 లో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ మూవీ నిలిచింది. యాక్షన్ రివెంజ్ గా తెరకెక్కిన మార్కో మల్లు వుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. అంతే కాదు 110 కోట్లతో మలయాళంలో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా నిలిచింది. 7th ప్లేస్ లో ‘హౌస్ ఫుల్ 5 ‘ నిలిచింది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ , జాక్విలిన్ లాంటి భారీ కాస్టింగ్ తో ఆసక్తి పెంచి ఎక్కువ మంది సెర్చ్ చేసేలా చేసింది. 8th ప్లేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మూవీ నిలిచింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శంకర్ దర్శకత్వం వహించారు. 9th ప్లేస్ లో ‘మిసెస్’ నిలిచింది. సనయా మల్హోత్రా మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీ గ్రేట్ ఇండియన్ కిచెన్ కి రీమేక్ . కొన్ని వివాదాల కారణంగా మిసెస్ కోసం ఎక్కువమంది సెర్చ్ చేసారు. 10th ప్లేస్ లో ‘మహావతార్ నరసింహ’ యానిమేటెడ్ మూవీ నిలిచింది. స్టార్ హీరోలు లేని ఈ యానిమేటెడ్ మూవీ 300 కోట్లకి పైగా వసూళ్లు చేసి టాప్ టెన్ లో నిలిచింది.





