back to top
Tuesday, January 20, 2026
spot_img
HomeMovie News Teluguనిన్న స్మృతి.. ఈ రోజు నివేదా పేతురాజ్

నిన్న స్మృతి.. ఈ రోజు నివేదా పేతురాజ్

మొన్న మొన్నటివరకు పెళ్లిళ్ల సీజన్ నడిచింది. ఇప్పుడు బ్రేకప్ ల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. సినీతారలు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతూ ఫాన్స్ కి సర్ప్రయిజ్ ఇస్తూ ఉన్నారు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా హీరోయిన్స్ ఎక్కువ సంఖ్యలో ఈ మధ్య గృహిణులయ్యారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంథానా కూడా ఆనందంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అయ్యింది. తన ప్రియుడు పలాస్ ముచ్చల్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. త్వరలోనే పెళ్లి అని అనౌన్స్ చేసారు. ఇంతలో తండ్రి అనారోగ్యానికి గురి అవటంతో పెళ్లి పోస్ట్ ఫోన్ అయ్యింది. తండ్రి కోలుకున్నాకా పెళ్లి జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి క్యాన్సిల్ అని స్మృతి అనౌన్స్ చేసి ఫాన్స్ కి షాకిచ్చింది.

ఇప్పుడు అదే దారిలో సౌత్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా నిలిచింది. సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేసుకుని పెళ్లి అంటూ బాహాటంగా అనౌన్స్ చేసి ఇలా పెళ్లి రద్దు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వరసగా స్మృతి, నివేదా ఇలా పెళ్లి క్యాన్సిల్ అంటూ ప్రకటించటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగులో అల వైకుంఠపురంలో, బ్రోచేవారెవరురా, పాగల్, చిత్రలహరి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా పేతురాజ్. తనపై ఎన్ని రూమర్లు వచ్చినా వాటిని ఖండిస్తూ నిబ్బరంగా నిలబడిన నివేదా ఇప్పుడు సడెన్ గా ఇలా పెళ్లి క్యాన్సిల్ ఎందుకు చేసుకుందో అని ఫాన్స్ ఆరా తీస్తున్నారు.

తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేసి పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది. ఇప్పుడు కాబోయే భర్త ఇనిస్టాగ్రామ్ ని అన్ ఫాలో చేయడంతో పాటు అతనితో ఉన్న ఫోటోలని కూడా డిలీట్ చేసింది. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీస్ అంతా బ్రేకప్ అని చెప్పకుండా ఇదే హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు నివేదా కూడా అలానే చేసింది. నివేదా ని కూడా రజ్ హిత్ ఇబ్రాన్ అన్ ఫాలో చేసాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular