సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. అది వింటే మహేష్ ఫాన్స్ పూనకాలు లోడింగ్ అంటారు. మహేష్ బాబు ‘వారణాసి’ లో 5 గెటప్స్ లో కనిపించనున్నాడట. ఇప్పటివరకు మహేష్ డ్యూయల్ రోల్ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు 5 గెటప్పులు అని ప్రచారం జరుగుతోంది. డివోషనల్ టచ్ తో తెరకెక్కుతున్న వారాణసి లో మహేష్ రాముడిగా, రుద్రగా కనిపించనున్నట్టు టీమ్ ఇది వరకే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ‘రుద్ర’ లుక్ రివీల్ చేసారు.
కానీ ఇప్పుడు మరో సర్‌ప్రైజింగ్ న్యూస్ బయటికి వచ్చింది. రాముడు, రుద్రుడితో పాటు మహేష్ ఇంకో మూడు గెటప్పుల్లో కనిపిస్తాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. అయితే ఏయే గెటప్పులు అన్నది రివీల్ కాలేదు. వాటిని కూడా ఎపుడో అప్పుడు జక్కన్న అనౌన్స్ చేస్తారేమో చూడాలి. లేదా రిలీజ్ వరకు సస్పెన్స్ లా ఉంచుతారో మరి. అసలు మహేష్ ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ కూడా చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం 5 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించటం అంటే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టినట్లే.
రాముడి గెటప్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందని ఈ ఎపిసోడ్ మూవీలో 30 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన గెటప్పుల్లో ఒక రోల్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. మొత్తానికి జక్కన్న పెద్ద ప్లాన్ వేస్తున్నాడని మహేష్ ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. మహేష్ – జక్కన్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ హిట్ కొట్టనున్నారని సినీప్రియులు కూడా ఫిక్స్ అయిపోయారు.



