HomeMovie News Teluguరాజశేఖర్ ని పక్కన పెట్టారా ?

రాజశేఖర్ ని పక్కన పెట్టారా ?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ టైం విజయ్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. వీరిద్దరు ‘మహానటి’ సినిమాలో చేసారు. కానీ ఇప్పటివరకు విజయ్ , కీర్తి హీరో హీరోయిన్స్ గా నటించలేదు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. రౌడీ జనార్దన్ లో విజయ్ ని ఢీ కొట్టే విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ పేరు వినిపించింది. బైకర్ మూవీతో పాటు రౌడీ జనార్దన్ లో కూడా రాజశేఖర్ విలన్ గా చేస్తున్నాడని, సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతోందని అంతా అనుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం రౌడీ జనార్దన్ విలన్ విజయ్ సేతుపతి అని వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తన నటనతో సత్తా చాటి భాషలకి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న సేతుపతి ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. సేతుపతి తెలుగులో ‘ఉప్పెన’ మూవిలో విలన్ గా నటించాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో హీరోగా ‘బెగ్గర్’ మూవీ చేస్తున్నాడు. ఇంతలో మళ్ళీ విలన్ అవతారం ఎత్తనున్నాడు.

మొదట రాజశేఖర్ ని అనుకుని ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సేతుపతి ని ఎందుకు దించారు? బైకర్ మూవీ షూటింగ్ లో రాజశేఖర్ గాయపడి మంచాన పడటం వలనే అని కొందరు అనుమానిస్తున్నారు. రాజశేఖర్ కాలికి గాయం అయ్యి మేజర్ సర్జరీ జరిగింది. దీని కారణంగా నాలుగు వారాల పాటు రాజశేఖర్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. అందుకనే రౌడీ జనార్దన్ టీమ్ సేతుపతిని అప్రోచ్ అయ్యి ఉంటారు. పైగా సేతుపతి అయితే పాన్ ఇండియా మార్కెట్ కి ప్లస్ అవుతాడని మేకర్స్ భావన. మొత్తానికి విజయ్ వర్సెస్ విజయ్ కాంబో ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular