హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి సౌత్ లో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. 2024 మీనాక్షికి లక్కీ ఇయర్ అని చెప్పొచ్చు. తెలుగులో వరుసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్స్ట్ మరిన్ని సినిమాలతో రానుంది. ప్రజంట్ నవీన్ పోలి శెట్టి తో ‘అనగనగా ఒక రాజు’ మూవీ చేస్తోంది. నాగ చైతన్యతో ‘వృషకర్మ’ చేస్తోంది. కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. మీనాక్షి కూడా అదే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మీనాక్షి లాంటి అందమైన, లక్కీ గర్ల్ ని ఎవరు చేసుకుంటున్నారు అని ఫాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మీనాక్షి కూడా మంచి ఫ్యామిలీ లోకే వెళ్తోంది అని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో మీనాక్షి లవ్ లో ఉందని, నాలుగేళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివారు కానున్నారని సమాచారం. మీనాక్షి మొదట మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. మీనాక్షి ఆర్మీ ఫ్యామిలీ కి సంభంధించిన అమ్మాయి. డెంటిస్ట్, స్టేట్ లెవెల్ స్విమ్మర్, ప్రొఫిషినల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అందాల పోటీలలో కూడా ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్స్ విన్ అయ్యింది.
2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మీనాక్షి. ఈ మూవీలో సుశాంత్ హీరో. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి వీరి రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించడంతో మరొకసారి వీరి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి.





