HomeMovie News Teluguసందీప్ వంగాకి షాకిచ్చిన ప్రభాస్

సందీప్ వంగాకి షాకిచ్చిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీతో రిలీజ్ కి రెడీగా ఉన్నాడు. ఫౌజీ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. త్వరలోనే సందీప్ వంగా స్పిరిట్ సెట్ లో జాయిన్ కానున్నాడు. సందీప్ స్పిరిట్ ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తరువాత సందీప్ చేస్తున్న మూవీ ఇదే కావటంతో స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ లాంటి వైల్డ్ డైరక్టర్ కి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ దొరికితే రికార్డ్స్ గల్లంతే.

ఈ మూవీలో ప్రభాస్ ఖాకీ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. డార్లింగ్ ఫస్ట్ టైం పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండటం విశేషం. స్పిరిట్ కోసం ప్రభాస్ లుక్ టెస్ట్ లు చేసి ఫైనల్ గా ఒక లుక్ సెలక్ట్ చేసారని, ఈ లుక్ రివీల్ అవకుండా ఉండేందుకు ప్రభాస్ ని ఆరునెలలు బయట ఫొటోస్, మీడియా కంట పడకుండా ఉండమని సందీప్ సూచించాడట. సినిమా ఈవెంట్స్ కి కూడా వెళ్లకూడదని, స్పిరిట్ అయ్యేవరకు ఇంకో సినిమాలో నటించకూడదని కండీషన్స్ పెట్టాడని టాక్. డార్లింగ్ కూడా సందీప్ మాటలకి తల ఊపాడట. కానీ మాట ఇచ్చిన నెక్స్ట్ వీక్ ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ లో కనిపించాడు.

జపాన్ ప్రజలతో ప్రభాస్ ఇంట్రాక్ట్ అయిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డార్లింగ్ ఫాన్స్ స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఇదే అని, మైండ్ బ్లోయింగ్ అని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సందీప్ ప్లాన్ ప్రభాస్ ఇలా ఫెయిల్ చేసేసాడు. ఇక ఇదే లుక్ ని ఫైనల్ చేస్తారా? లేదా చేంజ్ చేస్తారో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular