విక్టరీ వెంకటేష్ – అనీల్ రావి పూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, నిర్మాతలకి భారీగా లాభాలు మిగిల్చింది. చాలా కాలం తరువాత వెంకీకి సాలిడ్ హిట్ పడింది. ఈ ఒక్క హిట్ తో మళ్ళీ వెంకీ ఫామ్ లోకి వచ్చారు. ప్రజంట్ మెగాస్టార్ తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా వెంకీ ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.
వెంకటేష్, అనీల్ రావిపూడి లది హిట్ కాంబో. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. మళ్ళీ మరొకసారి వీరి కాంబో రెడీ అవుతున్నట్లు టాక్. అవును కొత్త ప్రాజెక్ట్ కాదు సీక్వెల్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి సీక్వెల్ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. వరల్డ్ వైడ్ గా 300 కోట్లు వసూల్ చేసి, వెంకీ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీకి సీక్వెల్ తీయాలని అనీల్ రావి పూడి, వెంకీ కూడా పూనుకుంటున్నారట. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ కూడా ముందే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్న క్లారిటీ ఇప్పుడు వచ్చింది.
2026 ద్వితీయార్థంలో షూటింగ్ స్టార్ట్ చేసి, 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మళ్ళీ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు వెంకీ – అనీల్. 2026 సంక్రాంతి కి చిరు తో కలిసి వస్తున్న అనీల్ నెక్స్ట్ సంక్రాంతికి వెంకీతో రానున్నాడు. ఈ లోగా వెంకీ – త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తి అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కి దిల్ రాజుతో పాటు సురేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట.





