గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో సీరీస్ సౌతాఫ్రికా ఖాతాలోకి వెళ్లింది.
ఇన్నింగ్స్‌లో భారత జట్టు తరఫున ఏకైకంగా పోరాడిన రవీంద్ర జడేజా 54 పరుగులతో నిలిచాడు. అతడు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు.
Series Champions! 🏆#TheProteas Men create history in India with a sensational 2-0 Test series clean sweep. 🌟🇿🇦
— Proteas Men (@ProteasMenCSA) November 26, 2025
This marks South Africa’s first Test series triumph on Indian soil in 25 years. 👏🏏 pic.twitter.com/LyNwofsXZE
సౌతాఫ్రికా బౌలర్లు భారత్ బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడిచేశారు.
హార్మర్ – 6 వికెట్లు
కేశవ్ మహారాజ్ – 2 వికెట్లు
ముత్తుస్వామి – 1 వికెట్
మార్కో యాన్సన్ – 1 వికెట్
ఐదో రోజు భారత్ 27/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆడటం ప్రారంభించింది. కానీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది.
సాయి సుదర్శన్ (14), జడేజా (54) కొంతసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోయింది. ఇద్దరూ కలిసి 94 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యం మాత్రమే సాధించారు. అనంతరం సుదర్శన్ ముత్తుస్వామి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
తదుపరి బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో భారత ఇన్నింగ్స్ త్వరగానే ముగిసిపోయింది.
చివరికి సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది.





