HomeMovie News Teluguస్పిరిట్ లో స్టార్ నటి.. ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్!

స్పిరిట్ లో స్టార్ నటి.. ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబెరాయ్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లో నదియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్‌కు సంబంధించిన క్యారవాన్ ఏర్పాట్లలో నదియా పేరుతో ప్రత్యేక క్యారవాన్ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభాస్, నదియా కలిసి నటించిన మిర్చి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నదియా నటించగా, వారి కాంబినేషన్‌కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ స్పిరిట్ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రంలో నదియా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మొత్తానికి.. స్పిరిట్ కు సంబంధించిన ఈ తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular