HomeMovie News Telugu'NBK -111' లో బాలయ్య ద్విపాత్రాభినయం

‘NBK -111’ లో బాలయ్య ద్విపాత్రాభినయం

నంద‌మూరి బాల‌కృష్ణ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. యంగ్ జనరేషన్ హీరోలు రెండేళ్ళకి ఒక సినిమా చేస్తూ ఉంటే బాలయ్య మాత్రం ఏడాదికి రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో ఉన్నారు. 2025 ప్రారంభం లో ‘డాకు మహారాజ్’ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టిన బాలయ్య ఇదే ఏడాది డిసెంబర్ లో ‘అఖండ – 2 ‘ తో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. బోయ‌పాటి బాలయ్య కాంబో ‘అఖండ 2 ‘ డిసెంబర్ 5 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఒక మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంటుండగా ఇప్పుడు ఇంకొక సినిమా స్టార్ట్ చేసారు బాలయ్య.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘#NBK111’ మొదలయ్యింది. నవంబర్ 26 న ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఓ పవ‌ర్ పుల్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో బాలయ్య లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాలయ్య ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాల‌య్య రెండు లుక్స్‌ కనిపిస్తున్నాయి పోస్టర్ లో. ఒక లుక్ లో యోధుడిగా, మ‌రొక లుక్‌లో మెడ‌లో రుద్రాక్ష‌మాల‌తో ప‌వ‌ర్‌పుల్‌గా ఉన్నారు బాలయ్య.

NBK -111 మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్య కి జోడీగా న‌య‌న‌తార హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య- నయన్ లది హిట్ కాంబో కావటం, బాల‌య్య, గోపిచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో బాలయ్య ఖాతాలో ఇంకొక హిట్ గ్యారంటీ అని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular