మిల్కీబ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. ఇంకా చేతినిండా సినిమాలతో కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంది. ఎవరికైనా వయసు పెరిగిన కొద్దీ ఛాన్స్ లు తగ్గుతాయి. కానీ తమన్నా కి మాత్రం రివర్స్ లో జరుగుతోంది. వయసు పెరుగుతున్న తరగని అందంతో, క్రేజ్ తో ఛాన్స్ లు అందుకుంటూనే ఉంది. తమన్నా కెరియర్ ఇంత బిజీగా ఉండటానికి కారణం భేషజాలు లేని ఆమె వ్యక్తిత్వం, నిర్ణయాలు. తానొక స్టార్ హీరోయిన్ అని హీరోయిన్ గా అయితేనే చేస్తా అని భీష్మించుకుని కూర్చోలేదు. ఎలాంటి ఛాన్స్ వచ్చినా నటనకి ఆస్కారముంటే చాలని ఓకే చెప్తోంది.
లేడీ ఓరియెంటెడ్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ ఇలా ఏది మిస్ చేయటం లేదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఫుల్ బిజీగా ఉంది తమన్నా. ఈ ఏడాది తెలుగులో ‘ఓదెల 2 ‘లో మెయిన్ లీడ్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్ తో మళ్ళీ ఆడియన్స్ ని మెప్పించింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రెయిడ్ 2 ‘ లో మంచి ఐటం నంబర్ చేసి విజయం అందుకుంది. 2025 లో సంతృప్తిగా ఉన్న తమన్నా జర్నీ 2026 లో ఇంకా స్పీడ్ అందుకున్నట్లు తెలుస్తోంది.
కారణం 2026 లో తమన్నా చేతిలో ఎనిమిది సినిమాలున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా చేసినవి, ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు అన్నీ ఉన్నాయి. 2026 జనవరిలో ‘ది రాజాసాబ్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. నెక్స్ట్ చిరు తో ‘మనశంకర వరప్రసాద్ గారు’ తో రానుంది. ఇందులో చిరు తో కలిసి కిక్కిచ్చే ఐటెం సాంగ్ చేసిందని టాక్. బాలీవుడ్ లో ‘ఓ రోమియో’, ‘రేంజర్’ సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఇది షూటింగ్ షెడ్యూల్ లో ఉంది. వీటితో పాటు ‘వివాన్’, ‘రాగిణ ఎమ్ ఎమ్ ఎస్’ కి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. తమిళ్ లో సుందర్. సి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.





