అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 ఏళ్ల క్రితం జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ ఈ సినిమాను హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తూ మంచి స్పందన ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ శుభారంభం అయ్యింది.
ప్రత్యేకంగా, ఏపీ-తెలంగాణలో తొలి రోజే ₹1.47 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. డే 1 నుంచే బలమైన వసూళ్లు రావడం మూవీ టీమ్‌కి ఆనందాన్ని కలిగిస్తోంది.

ఈ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీవాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌గా అందించారు. అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్‌తో పాటు శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.





