తిరుమల శ్రీవారి ప్రసాదం (Tirumala Prasadam)పై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ వివాదానికి దారితీశాయి. క్యూలైన్‌లో ఉండగా “ప్రసాదం అడుక్కుంటున్నాడు… richest బిచ్చగాళ్లం” అంటూ నవ్వుతూ చేసిన వీడియోపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్ర విమర్శల నేపథ్యంలో శివజ్యోతి స్పందించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియోను విడుదల చేశారు.
ఆమె పేర్కొన్నదేమిటంటే.. “తిరుమల ప్రసాదంపై నేను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధపెట్టాయని నాకు తెలుసు. అవి పూర్తిగా నా పొరపాటు. పదివేల రూపాయల క్యూలైన్‌లో ఉన్నాననే సందర్భంలోనే ‘రిచ్’ అన్నాను. ప్రసాదాన్ని అవమానించే ఉద్దేశం అస్సలు లేదు.”
అలాగే.. “ప్రసాదంపై చేసిన కామెంట్లకు ఎలాంటి వివరణ ఇవ్వను. అది నా తప్పే. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటితో ఈ విషయం ముగించాలని కోరుకుంటున్నాను” అని శివజ్యోతి తెలిపారు.
తాను అన్ని మతాలను గౌరవిస్తానని, దేవుళ్లకు ప్రతిరోజూ పూజలు చేసే వ్యక్తినని, ఇలాంటి తప్పులు ఇకపై జరగకుండా చూసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.





