కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ దర్శకులకి బెస్ట్ ఆప్షన్ గా మారాడు. ధనుష్ ఈ మధ్య తమిళ సినిమాలకంటే తెలుగు సినిమాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రాంతీయ చిత్రాలకి ధనుష్ బెస్ట్ ఛాయిస్ గా మారాడు. ధనుష్ కూడా మొదటి నుంచి డిఫరెంట్ కథల ఎంపికతో స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడదే టాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడేలా చేసింది.
ధనుష్ కి క్లాస్, మాస్ అని లెక్కలు లేవు కథ ఏదైనా, పాత్ర ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు. అందుకే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ దర్శకులు కూడా ధనుష్ కోసం కథలు రాస్తున్నారు. తెలుగులో సర్, కుభేర సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. నెక్స్ట్ తెలుగులో మరికొన్ని మూవీస్ చేస్తున్నాడట ధనుష్. నీది నాది ఒకే కథ, విరాటపర్వం లాంటి సినిమాలు చేసిన వేణు ఊడుగుల దర్శకత్వంలో ధనుష్ నటించనున్నాడట. వేణు ధనుష్ కి ఒక అద్భుతమైన కథను వినిపించాడని, ఆ కథ ధనుష్ కి కూడా నచ్చిందని టాక్. త్వరలోనే ఈ కాంబో పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.
నెక్స్ట్ అజయ్ భూపతి కూడా ధనుష్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి ఘట్టమనేని వారసుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణని తెరంగేట్రం చేసే పనిలో ఉన్నాడు. ఈ కథ పూర్తి అయ్యాకా ధనుష్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడట. ఇంకా మరికొందరు టాలీవుడ్ దర్శకులు ధనుష్ కోసం కథలు సిద్ధం చేసి క్యూలో ఉన్నారని టాక్. ధనుష్ కూడా తెలుగులో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటూ, తమిళ్ లో దర్శకుడిగా బిజీ అవుతున్నాడు. పర భాషలో హీరోగా నిలదొక్కుకుంటూ, సొంత భాషలో దర్శకుడిగా మార్క్స్ కొట్టేస్తున్నాడు.





