హైదరాబాద్లోని రెండు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు.. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలపై జీహెచ్ఎంసీ అధికారులు (GHMC officials) కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సంవత్సరాలుగా వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను భారీగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు బల్దియా విచారణలో బయటపడింది.
తాజా డేటా ప్రకారం, నిజానికి ₹11.52 లక్షలు చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) కేవలం ₹49,000 మాత్రమే చెల్లించినట్లు వెల్లడైంది. ఇదే విధంగా ₹1.92 లక్షలు ఫీజు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios) కేవలం ₹1,900 మాత్రమే చెల్లించిన విషయం బయటకు వచ్చింది.
ఈ ఎగవేతలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు జరిపి, ఇరు స్టూడియోలకు అసలైన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణం చెల్లించాలని అధికారిక నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులపై రెండు పెద్ద స్టూడియోలు ఎలాంటి వివరణ ఇస్తాయో, అలాగే బల్దియా తదుపరి చర్య ఏమిటో అనే ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో పెరుగుతోంది.





