ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, విన్నా ఐ బొమ్మ రవి కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. పైరసీ తో ఇండస్ట్రీ వాసులకి చుక్కలు చూపించిన రవి తాజాగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఐ బొమ్మ రవి అరెస్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసారు. ఎక్కడో ఉండి పైరసీ చేసి దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఫైనల్ గా పోలీసులు రవిని అరెస్ట్ చేసారు.
ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు హ్యాపీ గా ఫీల్ అవుతుండగా, నార్మల్ ఆడియన్స్ మాత్రం రవి అరెస్ట్ తో ఉసూరుమంటున్నారు. కారణం ఎలాంటి ఓటీటీ రుసుము లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు చూసేవారమని వాపోతున్నారు. పైరసీ సైట్లు చాలా ఉండగా కేవలం ఐ బొమ్మ ని మాత్రమే ఇలా టార్గెట్ చేసారని రవి పై సానుభూతి చూపిస్తున్నారు. రవి అరెస్ట్ తో అతని వ్యక్తి గత జీవితం కూడా తెరపైకి వచ్చింది. దీనితో అతని వెర్షన్ లో ఆలోచిస్తూ రవిని సపోర్ట్ చేస్తున్నారు కొందరు.
ఈ నేపథ్యంలో రవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. అందుకే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే దిశగా రవి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట. ప్రజంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుండటంతో రవి బయోపిక్ కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రవి కథలో సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉండటంతో ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా రెడీ అవుతోందని టాక్. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబర్ ఫేమ్ దొరసాయి తేజ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ బయోపిక్ లో రవి లైఫ్, అతని ఫ్యామిలీ లైఫ్, జీవితంలో ఎదుర్కొన్న కష్ట, నష్టాలు. డబ్బు సంపాదన కోసం రవి ఎంచుకున్న మార్గం, చివరికి అరెస్ట్ లాంటి మలుపులుంటాయని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ ‘కింగ్’ గా మారిన రవి జర్నీతో ఆడియన్స్ ముందుకు రానున్నారని టాక్.





