దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఒక వైపు ‘వారణాసి’ సినిమా టాక్ ఇంకో వైపు జక్కన్న పై విమర్శలు వినిపిస్తున్నాయి. అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ ని టాలీవుడ్ ముంగిట నిలిపిన జక్కన్న పై విమర్శలా అని అంతా అవాక్కు అవుతున్నారు. కానీ దీనికి కారణం రాజమౌళి మాటలే. రామోజీ ఫిలిం సిటీ వేదికగా SSMB 29 మూవీ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు టీమ్. ఈ ఈవెంట్ లో టైటిల్ లాంచ్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.
ఈవెంట్ కు ముందు మహేష్ లుక్స్ ను బిగ్ స్క్రీన్ పై చెక్ చేస్తుండగా కొందరు డ్రోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీనికి జక్కన్న హర్ట్ అయ్యి తాము పడ్డ శ్రమ బూడిద పాలు అయ్యిందని, అందుకే తనకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. దీనితో ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే జక్కన్న పై పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఫైల్ చేశారు. రాజమౌళి విషయం గ్రహించి క్షమాపణలు చెప్పినా ఈ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించటంతో మరొకసారి జక్కన్న సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ “రాజమౌళిని దేవుడు కరుణించి, దేవుడిని నమ్మే విధంగా మార్చాలని, దేవుని కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అని,’ సెటైరిక్ గా మాట్లాడారు. అంటే జక్కన్న హేతువాది, దేవుడిపై నమ్మకం లేదన్న ఉద్దేశ్యంతో మాట్లాడారని బండి మాటలున్నాయి.





