HomeTeluguసల్మాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పాన్ మసాలా యాడ్‌పై కోర్టు నోటీసులు!

సల్మాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పాన్ మసాలా యాడ్‌పై కోర్టు నోటీసులు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి కోర్టు షాక్ తగిలింది. ఆయన ఒక పాన్‌ మసాలా కంపెనీకి (pan masala brand) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆ ప్రకటనలో తప్పుదారి పట్టించే సమాచారముందని ఆరోపిస్తూ రాజస్థాన్‌లోని వినియోగదారుల కోర్టులో ఆయనపై ఫిర్యాదు దాఖలైంది. ఈ నేపథ్యంలో కోర్టు సల్మాన్‌ ఖాన్‌తో పాటు ఆ పాన్‌ మసాలా తయారీ సంస్థకు నోటీసులు పంపింది.

వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ హైకోర్టు న్యాయవాది ఇందర్‌ మోహన్‌ సింగ్‌ హానీ ఈ ఫిర్యాదు చేశారు. సల్మాన్‌ ఖాన్‌ ప్రమోట్‌ చేసిన “రాజశ్రీ పాన్‌ మసాలా” ప్రకటనలో కుంకుమపువ్వు కలిపిన యాలకులు, కేసర్‌ కలిపిన పాన్‌ మసాలా అంటూ చూపించడం తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసర్‌ ధర కిలోకు సుమారు రూ.4 లక్షలుగా ఉండగా, కేవలం రూ.5కే అమ్మే పాన్‌ మసాలా ప్యాకెట్‌లో కేసర్‌ ఉండటం అసంభవమని వాదించారు. ఈ ప్రకటన ద్వారా కంపెనీతో పాటు సల్మాన్‌ ఖాన్‌ కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇందర్‌ మోహన్‌ సింగ్‌ వాదనలను కోర్టు సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. తప్పుడు సమాచారంతో కూడిన యాడ్‌లను వెంటనే నిషేధించాలని, ప్రజలను మోసం చేసే ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ గానీ, రాజశ్రీ పాన్‌ మసాలా సంస్థ గానీ దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్‌ 27కు వాయిదా వేసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular