రాష్ట్ర మంత్రివర్గంలోకి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)ను చేర్చాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన అక్టోబర్ 31న ఉదయం 11 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయనను ఎమ్మెల్సీగా నియమించి, హైదరాబాద్ నుంచి కేబినెట్‌లోకి తీసుకోవాలనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుంది.
Congratulations… Minister Azharuddin
— Congress for Telangana (@Congress4TS) October 29, 2025
తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్. ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న అజారుద్దీన్.
Mohammad Azharuddin is set to join the Telangana Cabinet and will take oath as a minister the day after tomorrow.#Azharuddin #Telangana… pic.twitter.com/hVEbnZ2oHO
క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత అజారుద్దీన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 1986లో అర్జున అవార్డు, 1988లో పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో అన్ని జిల్లాల నుంచి మంత్రులు ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరూ మంత్రిగా లేకపోవడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. గోపీనాథ్ అకాల మరణంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్నాయి.





