HomePolitics Teluguరాజకీయ యుద్ధంగా మారిన బీసీ బంద్‌.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డైలాగ్ వార్ హీట్!

రాజకీయ యుద్ధంగా మారిన బీసీ బంద్‌.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డైలాగ్ వార్ హీట్!

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. తమ హక్కులు సాధించాలంటూ బీసీ జేఏసీ (BC JAC) పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

ఇవాళ ఉదయం నుంచే బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీలు వీధులెక్కి నిరసనలు వ్యక్తం చేశాయి. అయితే ఈ ఉద్యమం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. బంద్‌ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు, ప్రతియారోపణలతో తలపడుతున్నారు.

బీజేపీ ఆటంకాల వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, కాంగ్రెస్‌కే చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రతిఘటిస్తోంది. ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ తిప్పికొడుతోంది. దీంతో రాజకీయ యుద్ధం కాస్త క్రెడిట్ వార్‌గా మారిపోయింది.

నెటిజన్లు కూడా ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల హక్కుల కోసం పోరాడే బదులు పార్టీలు ఒకరినొకరు తప్పుపట్టడమే ప్రధాన అజెండాగా మార్చుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో అన్ని పార్టీలు నిజాయితీగా ఉంటే సమస్య ఇప్పటికి పరిష్కారమై ఉండేదని వారు అంటున్నారు.

నెక్స్ట్ ఏంటి?
ఇవాళ్టి బంద్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసింది.

మరోవైపు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఇచ్చిన హామీని అదే పార్టీ అమలు చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బంద్‌ తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, ప్రతిపక్షాల తదుపరి వ్యూహాలు ఏవన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular