యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘క’ బ్లాక్ బస్టర్ విజయం తరువాత ఆయన నటించిన తాజా చిత్రం కే- ర్యాంప్ (K-Ramp) ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి టాక్ సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది.
ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ప్రేక్షకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అన్నారు – “అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు. థియేటర్లలో ఫ్యామిలీలు కలిసి సినిమా చూస్తూ గోల పెడుతున్నారు, ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ మా టీమ్‌కి చాలా హ్యాపీగా ఉంది. పండగ పూట కుటుంబం మొత్తం కలిసి నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది,” అని తెలిపారు.
Thank you all ❤️🙏#KRamp pic.twitter.com/VuaKukR50F
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2025
అదే విధంగా సినిమా మీద ప్రేక్షకుల అభిప్రాయాలు చెప్పుతూ – “కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు. ఇంకొందరంటే ఫస్ట్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ సూపర్ అంటున్నారు. ఏదేమైనా అందరూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. పాజిటివ్‌గా మాట్లాడిన, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్,” అని కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ఎస్.ఆర్. కల్యాణ మండపం విజయం తర్వాత ఇప్పుడు కే- ర్యాంప్తో కూడా అదే విజయాన్ని రిపీట్ చేశామని ఆయన అన్నారు. “మ్యాట్నీ, మార్నింగ్ షోలు పడగానే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మేజిక్ రిపీట్ అయింది,” అని కిరణ్ అబ్బవరం వీడియోలో తెలిపారు.





