HomeMovie News Teluguఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌.. హీరోగా దేవిశ్రీ ప్రసాద్‌?

ఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌.. హీరోగా దేవిశ్రీ ప్రసాద్‌?

‘బలగం’ సినిమాతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన కమెడియన్ వేణు ఇటీవల ఎల్లమ్మ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆయన 2023 నుంచి వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు.

దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. హీరో ఎంపిక విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కథ నితిన్‌, నాని, శర్వానంద్‌ల వద్దకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకి కూడా ఈ కథ వెళ్లినట్లు టాక్‌ వచ్చింది. దీంతో ఆయననే హీరోగా ఫైనల్ చేశారని అనుకున్నారు అందరూ.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోగా నటించబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వేణు, డీఎస్పీ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ విషయంపై సినిమా యూనిట్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్‌ పేరు మాత్రం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే, డీఎస్పీ హీరోగా అడుగుపెట్టనున్న తొలి ఫుల్ లెంగ్త్ సినిమా అవుతుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular