‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు పేరు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఆయన, తెలంగాణ యాస, సంస్కృతిని ప్రతిబింబించేలా తీసిన ‘బలగం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి పలు అవార్డులు కూడా దక్కాయి.
అయితే, ఆ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు కావస్తున్నా, వేణు తన రెండో సినిమాను పట్టాలెక్కించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నప్పటికీ, సరైన హీరో ఎంపికలో ఆలస్యం జరుగుతోందట.
మొదట ఈ ప్రాజెక్ట్‌కి నితిన్, నాని పేర్లు పరిగణనలోకి వచ్చాయి. ఇటీవల శర్వానంద్ పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు వేణు కొత్త ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుండగా, ఈ సినిమాతో ‘బలగం’ రికార్డులు బద్దలు కొట్టాలన్నదే వేణు లక్ష్యం.
తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తో వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిని దిల్ రాజుకి కూడా వివరించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
‘కిష్కింధపురి’ సినిమాతో ఇటీవల సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు వేణు దర్శకత్వం వహించే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌లో హీరోగా నటించే అవకాశం ఉందట. ఈ కాంబినేషన్ ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి (Sai Pallavi) పేరు వినిపిస్తున్న విషయం కూడా సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వేణు – సాయి శ్రీనివాస్ – సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా వస్తే, మరోసారి భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన కథను ప్రేక్షకులు చూసే అవకాశం వుంది.





