HomeMovie News Telugu‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్‌తో రామ్ మాస్ అవతారం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్‌తో రామ్ మాస్ అవతారం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్, కామెడీ జానర్స్‌లో తనదైన ముద్ర వేసుకున్న రామ్ ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka)’ ఇప్పటికే టైటిల్‌తోనే మాస్ హైప్‌ క్రియేట్ చేసింది.

పి. మహేష్ బాబు (P. Mahesh Babu) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని మరియు వై. శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు ఉపేంద్ర ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రామ్ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించాడు. ఓ సూపర్ స్టార్ హీరోకు వీరాభిమానిగా రామ్ పోషిస్తున్న పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందనే సూచనలు టీజర్‌లో కనబడుతున్నాయి. రామ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

అటు రామ్ – భాగ్యశ్రీ మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు కూడా టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్, ఎమోషన్, యాక్షన్ మిక్స్‌గా ఉన్న ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular