సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించనుండగా, ఈ చిత్రం ప్రస్తుతం ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది.
యాక్షన్, అడ్వెంచర్‌తో కూడిన ఈ గ్లోబల్ స్థాయి సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తుండగా, మరికొన్ని కీలక పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు.
ఇప్పటికే అభిమానులు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, నవంబర్‌లో జక్కన్న ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. మహేష్ బాబు కోసం రాజమౌళి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆమె అద్భుతమైన డాన్స్‌తో ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్ ఫిలింనగర్లో వినిపిస్తోంది.
ఈ వార్త విన్న మహేష్ ఫ్యాన్స్, “జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా!” అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు.
ఈ భారీ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యపాత్రలో నటించనుండగా, ఈ చిత్రాన్ని ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్‌గా తెలుస్తోంది.





