బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) థియేటర్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.
సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. కథ, విజువల్స్, మ్యూజిక్, టెన్షన్ బిల్డ్‌అప్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. తాజాగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. అధికారికంగా ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా, అక్టోబర్ 19న సాయంత్రం జీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.
జీ5 ఈ పోస్టుతో పాటు – “భయం.. మిమ్మల్ని చూసి మీలోని భయాన్ని కనుగొంటుంది” అనే ట్యాగ్‌లైన్‌ని షేర్ చేసింది. థియేటర్లలో హిట్ అయిన తర్వాత ఓటీటీలో కూడా అదే హవా కొనసాగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



