back to top
Thursday, November 13, 2025
spot_img
HomeMovie News Teluguబాక్సాఫీస్ దుమ్మురేపిన ‘కాంతార: చాప్టర్ 1’.. 9 రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు!

బాక్సాఫీస్ దుమ్మురేపిన ‘కాంతార: చాప్టర్ 1’.. 9 రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు!

రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) విజయదశమి సందర్భంగా విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ నిర్మాతలకు పెద్ద లాభాలు తెచ్చిపెడుతోంది. విడుదలైన మొదటి రోజునుంచే రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం, తొమ్మిదో రోజుకే ఒక మైలురాయిని చేరుకుంది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 509 కోట్లకు చేరుకున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన ఈ చిత్రం, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

ఈ ఏడాది విడుదలైన ‘ఛావా’ (Chhava) రూ. 600 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, త్వరలోనే ‘కాంతార: చాప్టర్ 1’ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆమె నటన సినిమాకి అదనపు బలాన్నిచ్చిందని ప్రేక్షకులు చెబుతున్నారు. రిషబ్ శెట్టి విజన్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, టెక్నికల్ ఎక్సలెన్స్ ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular