జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో ఉప ఎన్నిక (By-Election) అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ (Naveen Yadav) ను ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ప్రచారంలో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు రాజకీయ, సినీ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Actor Suman) కూడా తన మద్దతును ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సుమన్.#Hyderabad #suman #naveenyadav #jublieehillsByelections pic.twitter.com/ORcqJPlO1g
— Telugu Stride (@TeluguStride) October 10, 2025
సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సుమన్ మాట్లాడుతూ,
“జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈసారి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన మంచి యువకుడు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా ఉంటాడు. ఈ ఉప ఎన్నికల్లో నా పూర్తి మద్దతు నవీన్ యాదవ్‌దే” అని తెలిపారు.
సుమన్ మద్దతుతో నవీన్ యాదవ్ ప్రచారానికి మరింత ఊపందుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఈసారి పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



