HomeSports Telugu28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మందాన.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్!

28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మందాన.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్!

టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్‌లో దాదాపు 28 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టి కొత్త మైలురాయిని అందుకున్నారు.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా స్మృతి మందాన పేరు సువర్ణాక్షరాలతో చెరగని రీతిలో నిలిచిపోయింది. 2025 సంవత్సరంలో జరిగిన వన్డే మ్యాచ్‌లలో మొత్తం 973 పరుగులు సాధించి ఈ ఘనత సాధించారు.

ఇంతకు ముందు 1997లో ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిండా క్లార్క్ (Belinda Clark) 970 పరుగులు చేసి రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 28 సంవత్సరాల పాటు ఎవరికీ ఆ రికార్డు అందలేదు. ఇప్పుడు స్మృతి మందాన ఆ చరిత్రను మార్చారు.

ఈ మైలురాయిని ఆమె టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా అందుకున్నారు. అయితే ఆ మ్యాచ్‌లో స్మృతి కేవలం 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. ప్రస్తుతం భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular