తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చేసిన ప్రత్యేక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేశ్ బాబు తన ట్వీట్‌లో,
“Wishing the one and only @ssrajamouli a very Happy Birthday… The best is always yet to come. Have a great one sir.”
అని రాశారు. అలాగే రాజమౌళితో ఉన్న ఓ అందమైన ఫోటోను షేర్ చేశారు.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025
ఈ ట్వీట్‌లోని “The best is always yet to come” లైన్ చూసి, అభిమానుల్లో SSMB29 సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. నవంబర్‌లో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు “Maharaj”, “Globetrotter”, “GEN63” లాంటి పేర్లు చర్చలోకి వచ్చాయి. తాజాగా “వారణాసి” అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రదేశం పేరు అయినప్పటికీ, సినిమా గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కావడంతో ఈ టైటిల్‌పై ఆసక్తి పెరిగింది. అయితే గతంలో కూడా రాజమౌళి సినిమాల టైటిల్స్‌పై అనేక ఊహాగానాలు వచ్చి చివరికి మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి “వారణాసి” కూడా వదంతి మాత్రమే అయి ఉండవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్‌లో భారీ మార్పులు చేసుకున్నారు. ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం సిద్ధమవుతున్నారు. ఇదే ఆయన తొలి పాన్-వరల్డ్ (Pan World) సినిమా. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
మొత్తానికి, మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్‌ను అధికారికంగా నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే, ఇది ఒక ప్రభంజనం సృష్టించే ప్రాజెక్ట్‌గా నిలవనుందని ఫ్యాన్స్ నమ్మకం



