HomeMovie News Teluguరామ్ చరణ్ బాడీగార్డ్ జీతం వైరల్..

రామ్ చరణ్ బాడీగార్డ్ జీతం వైరల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో సినిమా కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం.. రామ్ చరణ్ పక్కనే కనిపించిన భారీ కాయుడైన బాడీగార్డ్.

రామ్ చరణ్‌తో ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ ముగిసే వరకు కనిపించిన ఆ స్పెషల్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా అని తెలుస్తోంది. అతను సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ అని సమాచారం.

ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నట్లు టాక్. ఇటలీ నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా పలు అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు సృష్టించాడని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు హై-లెవల్ సెక్యూరిటీ అందించడంలో కెవిన్‌కు మంచి గుర్తింపు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కెవిన్ జీతం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

రామ్ చరణ్ భద్రత కోసం ఆయనకు రోజుకు దాదాపు రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే లెక్కన నెలకు దాదాపు రూ.60 లక్షల వరకు రెమ్యునరేషన్ అవుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఇప్పటికే ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి, రామ్ చరణ్ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular