HomeTeluguఅగ్లీ స్టోరీ మూవీ రివ్యూ & రేటింగ్

అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: అగ్లీ స్టోరీ
దర్శకత్వం: ప్రణవ స్వరూప్

నటీనటులు: శ్రీ నందు, అవికా గోర్, రవితేజ మహదాస్యం, శివాజీ రాజా, ప్రగ్య తదితరులు

నిర్మాతలు: సుభాషిణి, కొండా లక్ష్మణ్

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: శ్రీ సాయి కుమార్ దారా
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

బ్యానర్: రియా జియా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 22 మే 2026

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. సినిమాలో నందు సైకో భర్త పాత్రలో కనిపించగా, అవికా గోర్ అమాయకమైన భార్య పాత్రలో నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి బలంగా నిలిచాయి.

కథ :

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను ఆమె మావయ్య (శివాజీ రాజా) ఇంటికి తీసుకువస్తాడు. చిన్ననాటి నుంచే కార్తీక్ (నందు) ఆమెపై మోజు పెంచుకుంటాడు. కానీ నేహా మాత్రం గౌతమ్ (రవితేజ మహాదాస్యం)ను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఆవేశంతో సైకోలా మారిపోతాడు.

తనకు ఇష్టం లేకపోయినా నేహా చివరకు కార్తీక్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంది? పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది? కార్తీక్ టార్చర్ ఎంత వరకు వెళ్లింది? గౌతమ్‌కు ఏమైంది? చివరకు జరిగిన రక్తపాతం వెనుక అసలు కారణం ఏమిటి? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

దర్శకుడు ప్రణవ స్వరూప్ కథను సీరియస్ టోన్‌లో తీసుకెళ్లాడు. ముఖ్యంగా కన్సెంట్ అనే సెన్సిటివ్ అంశాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. శ్రీ సాయికుమార్ ధారా సినిమాటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. తక్కువ బడ్జెట్‌లోనూ క్వాలిటీగా తెరకెక్కించారు.

సినిమా ప్రధానంగా టాక్సిక్ రిలేషన్‌షిప్స్, సైకో మెంటాలిటీ గురించి మాట్లాడుతుంది. భార్యాభర్తల మధ్య సమ్మతి ఎంత ముఖ్యమో చూపించే ప్రయత్నం చేసింది. అయితే మొదటి భాగంలో హీరో సైకోయిజం మీద ఎక్కువ సన్నివేశాలు రావడంతో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.

ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్న అమ్మాయిలకు కొన్ని సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి.

నటీ నటులు :

ఈ సినిమాలో నందు నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైకో భర్త పాత్రలో ఆయన పూర్తిగా లీనమై నటించారు. అతని ప్రవర్తన ప్రేక్షకుల్లో కోపం కలిగించేలా ఉంటుంది. అవికా గోర్ కూడా ఎమోషనల్ పాత్రలో మంచి నటన కనబరిచింది. బాధపడే భార్యగా ఆమె పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

శివాజీ రాజా తనకు అలవాటైన తండ్రి పాత్రలో కనిపించారు. రవితేజ మహాదాస్యం ప్రేమికుడి పాత్రలో సింపుల్‌గా నటించాడు. చివర్లో ప్రజ్ఞ నయన్ పోలీస్ పాత్రలో చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ప్లస్ పాయింట్స్

నందు నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

పాటలు
రొటీన్ స్టోరీ

You May Like This
- Advertisment -spot_img

Most Popular