HomeMovie News Teluguఅక్కినేని నాగార్జునతో మరోసారి 53 ఏళ్ల అందాల తార?

అక్కినేని నాగార్జునతో మరోసారి 53 ఏళ్ల అందాల తార?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున, తనదైన శైలితో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమారులు హీరోలుగా ఉన్నా కూడా, నాగార్జున ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హీరోగా కొనసాగుతున్నారు. వయసు పెరిగినా, యవ్వనం తగ్గలేదని చెప్పాలంటే అతనిని చూసి తెలుసుకోవచ్చు.

ఇప్పుడు ఆయన తన 100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా తమిళ దర్శకుడు కార్తీక్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. మే 2026లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇంతలోనే ఈ సినిమా నుండి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన కుమారులు కూడా కనిపించబోతున్నారని, అలాగే సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే ఆమె హీరోయిన్ పాత్రలో కనిపిస్తారా లేక స్పెషల్ రోల్‌లోనో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే నాగార్జున-టబు కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో, ఈ జంట మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతుందనే వార్త అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular