పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ (OG Movie) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా భారీ హిట్‌గా నిలిచిన విక్టరీ వెంకటేశ్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ను కూడా ‘ఓజీ’ దాటిందని తెలిపారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్ల వసూళ్లు సాధించగా, ‘ఓజీ’ దాన్ని మించి రికార్డు క్రియేట్ చేసినట్లు ప్రకటించారు.
Alalika Kadhalaka Bhayapadele…
— DVV Entertainment (@DVVMovies) October 5, 2025
Kshanakshanamoka Thala Thegi Padele…
Pralayamu Yedhuruga Nilabadele..
Meti Dhaatiki Lokam Hadale…#OG is the highest grossing Telugu Film of 2025 🔥🔥🔥🔥#TheyCallHimOG #BoxOfficeDestructorOG pic.twitter.com/TGQYcilw3C
అయితే, ఈ కలెక్షన్లకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ విడుదల చేయకపోవడం గమనార్హం. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు.
ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌కు ముందు నుంచే హైప్ సృష్టించిన ఈ సినిమా, ప్రీమియర్స్‌తోనే హిట్ టాక్ సంపాదించింది.
మొదటి రోజే రూ.154 కోట్ల గ్రాస్ రాబట్టగా, మూడు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. నాలుగో రోజుకి రూ.252 కోట్ల గ్రాస్ దాటినట్లు మేకర్స్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం, ఇవాళ అధికారికంగా ‘ఓజీ’ 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచిందని ప్రకటించారు.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





