తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ప్రముఖ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి (ACP Vishnu Murthy) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గతంలో ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ (Allu Arjun)పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు.
సుదీర్ఘ కాలంగా డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేసిన విష్ణుమూర్తి, తన క్రమశిక్షణతో, ప్రజా సేవా తపనతో గుర్తింపు పొందారు. తలపై మూడు సింహాలే తన దైవమని నమ్మి ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన ఆయన, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త విన్న సహచరులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం – ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి https://t.co/XjY9IKmOIS pic.twitter.com/3PUTYsXWOa
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024
అల్లు అర్జున్‌పై ఏసీపీ విష్ణుమూర్తి వ్యాఖ్యలు
నాటి ప్రెస్మీట్లో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. “డబ్బు మదంతో బడా బాబులు మాట్లాడుతున్నారు. ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టి తన తప్పు లేదంటున్నాడు. ఇది పోలీసులపై అపనిందలు వేయడం. అల్లు అర్జున్ తన పరిధిని దాటి మాట్లాడకూడదు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు” అని అన్నారు.
అలాగే “బందోబస్తు కావాలంటే ప్రొసీజర్ ప్రకారమే జరగాలి. పోలీసులను బూతులు తిడుతూ, నోరు జారడం తగదు. మేము కూడా మనుషులమే. మాకు ఆకలి, దప్పిక, కుటుంబం ఉంది,” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఏసీపీ విష్ణుమూర్తి మరణం పట్ల సహచరులు, సినీ వర్గాలు, ప్రజలు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





