HomePolitics Teluguపవన్ ‘ఓజీ’ సినిమాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆటో డ్రైవర్ల పథకం ప్రారంభం

పవన్ ‘ఓజీ’ సినిమాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆటో డ్రైవర్ల పథకం ప్రారంభం

విజయవాడలో సీఎం చంద్రబాబు (Chandrababu) ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. “ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.15 వేల రూపాయలు నేరుగా జమ చేశాం. ఇది నిజమైన పండుగ. ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఆన్‌లైన్ ద్వారానే సొమ్ము చేరుతుంది. చెప్పిన మాట నిలబెట్టే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం” అని అన్నారు.

గతంలో రోడ్ల పరిస్థితుల వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం వాహనాల మరమ్మతులకే ఖర్చయ్యేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోడ్లు అద్భుతంగా మారడంతో ఆ ఇబ్బందులు తగ్గాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం మనదేనని, రూ.33 వేల కోట్లు పెన్షన్లకే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు.

అలాగే, “వచ్చే ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి. గత ఎన్నికల్లో 94 శాతం సాధించాం, ఈసారి 100 శాతం లక్ష్యం” అని స్పష్టం చేశారు. దసరా పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకున్నారని, పవన్ కల్యాణ్ ఓజీ సినిమా (OG Movie) కూడా చూశారని, విజయవాడ ఉత్సవం ఘనంగా జరిగిందని, ఇప్పుడు ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular