HomeMovie News Teluguమెగాస్టార్‌ మన ఇంటికొచ్చేస్తున్నాడు

మెగాస్టార్‌ మన ఇంటికొచ్చేస్తున్నాడు

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తాజా షెడ్యూల్‌ ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13 నుండి ఈ ప్రోగ్రాం బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ మధ్యే చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టారు. అదే జోరుతో 151వ సినిమా కూడా లైన్‌లో పెట్టేశాడు చిరంజీవి.

అలాగే వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించనున్నాడు చిరంజీవి. సినిమాలకు దూరంగా వెళ్లి రాజకీయాల్లో సత్తా చాటాడు. రీ ఎంట్రీలో కూడా తనకెదురు లేదని నిరూపించుకున్నాడు తొలి సినిమాతోనే. ఓ సాదా సీదా సినిమాతో చిరంజీవి సాధించిన విజయం అంతా ఇంతా కాదు. కలెక్షన్స్‌ పరంగా నెంబర్‌ వన్‌ అనిపించుకున్నాడు. అలాగే టాలీవుడ్‌ నెంబర్‌ గేమ్‌లో కూడా నెంబర్‌ వన్‌ నేనే అని ప్రూవ్‌ చేసేసుకున్నాడు ‘ఖైదీ’ సినిమాతో.

త్వరలో టీవీలో ప్రసారం కాబోయే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కోసం జనం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన టైంలో మెగాస్టార్‌ గెస్ట్‌గా వచ్చి హాట్‌ సీట్‌లో కూర్చుని తన అనుభవాలని పంచుకున్నారు. ఇప్పుడే ఆయన హోస్ట్‌గా మారి తన ఫ్యాన్స్‌ అనుభవాల్ని స్వయంగా తెలుసుకోనున్నారు. 2016 విజయ దశమి సందర్భంగా స్టార్ట్‌ అయిన ఈ ప్రోగ్రాం అతి త్వరలోనే టీవీలో సందడి చేయనుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular