HomeMovie News Teluguరామ్ చ‌ర‌ణ్ కోసం రెండు టైటిళ్లు

రామ్ చ‌ర‌ణ్ కోసం రెండు టైటిళ్లు

ధృవ‌తో ఫామ్‌లోకి వ‌చ్చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇప్పుడు సుకుమార్ సినిమానీ హిట్ చేయాల‌ని త‌పన ప‌డుతున్నాడు. అందుకే గెట‌ప్‌, సెటప్ మొత్తం మార్చుకొంటున్నాడు. తొలిసారి త‌న కెరీర్‌లో ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ‌ని ఎంచుకొన్నాడు చ‌ర‌ణ్‌. ఇందులో చెర్రీ చెవిటివాడిగా క‌నిపించ‌నున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఈ సినిమాకి సంబంధించి రెండు టైటిళ్లు కూడా ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రేప‌ల్లె, ప‌ల్లెటూరి మొన‌గాడు అనే టైటిళ్లు ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.

సుకుమార్ క‌థ‌లే కాదు… టైటిళ్లు కూడా క్రియేటీవ్‌గా ఉంటాయి. ఈ సారీ అలాంటి క్రియేటీవ్ టైటిలే పెడ‌తాడ‌ని, అందుకోసం సుక్కు అన్వేష‌ణ ప్రారంభించాడ‌ని తెలుస్తోంది. సుక్కు రేప‌ల్లె అనే టైటిల్ పై మ‌న‌సు ప‌డ్డాడ‌ని, ఆ టైటిల్ దాదాపుగా ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.  లేదంటే ఓ ఫార్ములా ఏదో వ‌చ్చేలా.. టైటిల్ డిజైన్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి… సుక్కు ఎలాంటి టైటిల్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular