HomeMovie News Teluguఎన్టీయార్‌ పాత్రలో నేనే నటిస్తా - బాలయ్య

ఎన్టీయార్‌ పాత్రలో నేనే నటిస్తా – బాలయ్య

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన కుమారుడు నందమూరి బాలయ్య తెలిపారు. ఇటీవలే చారిత్రాత్మక చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు ఆయన. ఇది ఆయన వందో చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత చిత్రం ‘రైతు’ అని కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఉండబోతోందని ఆయన గతంలోనే తెలిపారు. కానీ ఆ సినిమా ఇప్పుడు సస్పెన్స్‌లో పడింది. తాజాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌పై దృష్టి పెట్టారు బాలయ్య.

ఈ సినిమా కథ కోసం ఓ ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారట బాలకృష్ణ. ఆ టీంలో ప్రముఖ జర్నలిస్టులు, ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితులు ఉన్నారట. వారి నుంచి కీలకంగా సేకరించి సమాచారంతో మిళితం చేసి ఈ సినిమాకి కథని సిద్ధం చేయనున్నారనీ సమాచారమ్‌. ఈ సినిమాకి ఓ ప్రముఖ డైరెక్టర్‌ని పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఆ వివరాలు తెలపనున్నారు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య తాజా అనౌన్స్‌మెంట్‌ మరో సంచలనానికి దారి తీసినట్లే. ఒకవేళ బాలకృష్ణ చెప్పినట్లుగా ఎన్టీఆర్‌ బయోపిక్‌కి దృశ్య రూపం ఇస్తే నిజంగా అది ఓ సెన్సేషనే అవుతుంది.

అంతేకాదు ఆరు కోట్ల ఆంధ్రులు మెచ్చే అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి ఎన్టీఆర్‌. అలాంటి వ్యక్తి జీవిత గాధపై సినిమా అంటే ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా కథ సిద్ధం కావాలి. అలాగే ఈ అద్భుతాన్ని తెరకెక్కించే సామర్ధ్యం ఉన్న ఆ ప్రముఖ డైరెక్టర్‌ ఎవరో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular