HomeMovie News Teluguచెర్రీ సుక్కు కాంబో రెడీ.. దుబాయ్ లో ఫైనల్ నేరేషన్

చెర్రీ సుక్కు కాంబో రెడీ.. దుబాయ్ లో ఫైనల్ నేరేషన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజంట్ ‘పెద్ది’ మూవీ షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు. పెద్ది షూటింగ్ ముగింపు కి వచ్చేట్టు ఉండటంతో, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టాడు. పెద్ది తరువాత చెర్రీ పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. RC17 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారట సుకుమార్. చెర్రీ, సుకుమార్ ఇది వరకు రంగస్థలం మూవీకి కలిసి వర్క్ చేసారు. చిట్టి బాబుగా చెర్రీ నటనకి విమర్శకులు ప్రశంసలు దక్కాయి. పలు అవార్డ్స్, రివార్డ్స్ పొంది చెర్రీలో ఉన్న కొత్త కోణాన్ని వెలికి తీసింది రంగస్థలం. ఈ మూవీలో సుకుమార్ చెర్రీని మలచిన విధానానికి ఫాన్స్ ఫిదా అయిపోయారు.

మళ్ళీ వీరి కాంబో రానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ RC17 కథ ఫినిష్ చేసారని, ఫైనల్ డ్రాఫ్ట్ తో రెడీగా ఉన్నారని టాక్. అయితే ఫైనల్ నెరేషన్ కోసం రామ్ చరణ్, సుకుమార్ త్వరలోనే దుబాయ్ లో సిట్టింగ్ వేయనున్నారట. మార్పులు చేర్పులు అన్నీ చేసి ఫుల్ స్క్రిప్ట్ తో బరిలో దిగేందుకు సుక్కు & కో ప్లాన్ చేస్తున్నారట. అంతా ఫైనల్ అయ్యాక ఇండియా వచ్చి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారని టాక్.

RC17 కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని సమాచారం. మార్చ్ 27న పెద్ది రిలీజ్ తరువాత చెర్రీ సుకుమార్ కాంబో పట్టాలెక్కుతోంది అని, పూజా కార్య క్రమాలు కూడా మార్చ్ లోనే ఉంటాయని సమాచారం. పుష్ప నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబోని నిర్మిస్తున్నారు. చెర్రీకి జోడీగా ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular