ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తరువాత బాహుబలి 2 , కల్కి , సలార్ మూవీస్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రభాస్ మూవీ కోసం గ్లోబల్ ఫాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. డార్లింగ్ మూవీ అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వసూళ్లు గ్యారంటీ. అందుకే ప్రభాస్ అడిగినంత ఇవ్వటానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. టాలీవుడ్ హీరోలు చాలా మంది 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, ప్రభాస్ టాప్ లిస్ట్ లో ఉన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ పూర్తి చేసి, ఫౌజీ తో బిజీ గా ఉన్నాడు. తరువాత ‘స్పిరిట్’ సెట్ లో జాయిన్ అవుతున్నాడు. స్పిరిట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 150 కోట్లు తీసుకున్న ప్రభాస్ స్పిరిట్ కి 160 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా టాప్ లో ఉన్నాడు. ప్రభాస్ కటౌట్ కి ఇది తక్కువే అని ఫాన్స్ వాదన. ప్రభాస్ కి గ్లోబల్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. అమెరికా, యూరోప్ తో పాటు జపాన్ లాంటి దేశాల్లో కూడా ప్రభాస్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 160 కోట్లు పెద్ద మొత్తం కాదని డార్లింగ్ ఫాన్స్ వాదన. పైగా ఈ సినిమాకు డార్లింగ్ 6 నెలల కాల్షీట్లు కేటాయించాడట.





