HomeMovie News Teluguపవన్ తో మళ్ళీ సాయి తేజ్

పవన్ తో మళ్ళీ సాయి తేజ్

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలని సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ పవన్ సినిమాలకి దూరంగా ఉండటాన్ని ఫాన్స్ ఖండిస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా పవన్ కథలతో వెయిటింగ్. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవన్ కూడా మనసు మార్చుకుని సినిమాల్ని, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేస్తా అని మాటిచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యింది. అందుకే పవన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్‌ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది పాత కమిట్ మెంట్ అని ఇప్పుడు తెరకెక్కుతోందని టాక్. దిల్ రాజు బ్యానర్ లో కూడా పవన్ సినిమా ఉందని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి దిల్ రాజు, పవన్ కాంబో తెరపైకి వచ్చింది. ఈ కథ కోసం ఇప్పటికే ‘అర్జున’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అప్పుడే ఫాన్స్ ఈ టైటిల్ ని వైరల్ చేస్తున్నారు. టైటిల్ క్యాచీగా, పాన్ ఇండియాకి తగ్గట్టు ఉందని ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇదే కాంబో నుంచి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇది మెగా ఫాన్స్ కి ఫీస్ట్ లాంటి న్యూస్ అని చెప్పొచ్చు. కారణం ఈ మూవీలో పవన్ తో పాటు సాయి ధర్మ తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడని టాక్. ఇది వరకు పవన్, తేజ్ కలిసి ‘బ్రో’ మూవీలో నటించారు. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరొకసారి మామా, అల్లుడు కలిసి రచ్చ చేయనుండటం తో మెగా ఫాన్స్ ఆనందానికి అంతే లేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular