బాలకృష్ణ ‘అఖండ2: తాండవం’ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 4న రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలకి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. అభిమానులు ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా? అని ఎదురుచూశారు. అయితే, చాలా నీరిక్షణ తర్వాత సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షో రద్దు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఓవర్సీస్లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుందని చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్స్ పడకపోడానికి సాంకేతిక కారణాలని అంటున్నా ఆర్ధిక లావాదేవిలే అసలు కారణం. ప్రతిసినిమాకి రిలీజ్ విషయంలో చివరి నిమిషం వరకూ క్లియరెన్స్ లు వుంటాయి. కాకపోతే ఇలా షోలు రద్దు చేసేవరకూ వ్యవహారం వెళ్ళదు. అందులోనూ బాలయ్య లాంటి మాస్ స్టార్ సినిమాకి ప్రీమియర్ షోలే అందాన్ని తీసుకొస్తాయి. అలాంటిది అఖండ 2 ప్రిమియర్స్ రద్దుకావడం అభిమానులని నిరాశ పరిచింది. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అంటే ఇప్పటికీ బుక్ మైషోలు టికెట్స్ లైవ్ లోకి రాలేదు. నిజంగా బ్యాడ్ ప్లానింగ్ ఇది.
#Akhanda2 Premieres in India scheduled for today are cancelled due to technical issues.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.
The overseas premieres will play as per the schedule today.
గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య ఈ సినిమా కోసం కష్టపడ్డారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ముంబై.. పర్యటనలు చేశారు. స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక క్యారెక్టర్ కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. మైనస్ డిగ్రీలలో షూట్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేశారు. సినిమా చుట్టూ మంచి బజ్ వచ్చింది. పైగా బాలయ్య, బోయపాటి సినిమా అంటే ప్రిమియర్స్ ఇచ్చే కిక్ వేరు. మొత్తానికి అలాంటి కిక్ లేకుండా పోయింది.





