టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆయన, తన ఎనర్జీ, స్టైల్, టైమింగ్‌తో అభిమానులను ఆకట్టుకొని స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఇటీవల వరుస డిజాస్టర్లతో రవితేజ కెరీర్ కాస్త చాపకింద నీరులా సాగుతున్నప్పటికీ, కొత్త కథలు, కొత్త డైరెక్టర్లతో రిస్క్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంకొకవైపు, మాస్ మహారాజా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ‘ఖుషి’ సక్సెస్ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, రవితేజతో కలిసి ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
సినిమా కథ ఒక తండ్రి తన కూతురిని ప్రమాదం నుండి రక్షించుకునే ఎమోషన్ – థ్రిల్లర్ ట్రాక్‌పై నడుస్తుందట. ఇందులో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంగీతం ‘కాంతారా’ ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ అందిస్తున్నారని తెలుస్తుంది.
ఈ భారీ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌ను 2026లో విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.





