ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా నటించిన ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ అయ్యి ఏడాది అయ్యింది. డిసెంబరు 4 న RTC క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య ధియేటర్ లో ప్రీమియర్ షో వేశారు. ఈ షో కి బన్నీ ఫ్యామిలీతో కలిసివెళ్ళాడు. రష్మిక కూడా వీరితో ఉంది. బన్నీ ని చూసేందుకు ఫాన్స్ తోసుకురావటంతో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. తల్లి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు శ్రీతేజ్ కోమాలో ఉన్నాడు. ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఏడాది గడిచినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ పై చాలా విమర్శలు వచ్చాయి, చివరికి అది అరెస్ట్ వరకు వెళ్ళింది. జైలు గోడల వరకు వెళ్లి బన్నీ బయట పడ్డాడు. పశ్చాతాపంతో బన్నీ శ్రీతేజ్ హాస్పటల్ ఖర్చులు పెట్టుకున్నాడు. కొంత నష్ట పరిహారం కూడా ఇచ్చాడు. పుష్ప డైరక్టర్ సుకుమార్, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా శ్రీ తేజ్ కి ఆర్థిక సహాయం చేసారు. అంతే కాకుండా బన్నీ టీమ్ శ్రీతేజ్ ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది. మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తోంది.
సరిగ్గా శ్రీతేజ్ గాయపడి ఏడాది అయిన సంధర్భంగా మళ్ళీ ఈ విషయం తెరపైకి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శ్రీతేజ్ తండ్రి చాలా అసంతృప్తిగా ఉన్నారని, కారణం బన్నీ టీమ్ పట్టించుకోవటం మానేయటమే అని తెలుస్తోంది. కానీ అవన్నీ పుకార్లని, బన్నీ టీమ్ శ్రీతేజ్ ని ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉన్నారని, ఇప్పటివరకు శ్రీతేజ్ కుటుంబం కోసం 3.20 కోట్లు ఫిక్సెడ్ డిపాజిట్ చేసారని, ఆ వడ్డీని కూడా బ్యాంక్ చెల్లిస్తోందని బన్నీ సన్నిహితుల వాదన. తాజాగా ఈ వివాదంపై అల్లు అర్జున్ సన్నిహితుడు నిర్మాత బన్నీ వాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. శ్రీతేజ్ కుటుంబానికి ఇంకా ఎలాంటి సహాయం అందించడానికి అయినా తాము సిద్ధమని, అతను బాగా కోలుకోవాలని ఆశిస్తున్నానని వెల్లడించారు.





