టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ 2’ రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే హైప్ వేరే లెవల్. సింహా, లెజెండ్, అఖండ కలిసి ఇచ్చిన మూడు బ్లాక్బస్టర్ల తర్వాత వస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే కారణంగా సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో, తాజాగా ‘అఖండ 2’లో ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ బయటకు వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడని ముందే తెలిసింది. కానీ అతను ఏ పాత్రలో కనిపించబోతున్నాడన్న విషయం మాత్రం రహస్యంగానే ఉంచింది యూనిట్.
ఇప్పుడు ఆ సస్పెన్స్‌ను స్వయంగా బోయపాటి శ్రీను క్లియర్ చేశారు. తన కుమారుడు వర్షిత్ ‘భక్త ప్రహ్లాదుడు’ పాత్రలో కనిపించనున్నాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ప్రహ్లాదుడి గెటప్‌లో కనిపించే బాలుడే వర్షిత్ అని బోయపాటి వెల్లడించారు.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్షిత్ తాను సినిమాలో నటిస్తున్నట్లు చెప్పినా, పాత్ర వివరాలు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు దర్శకుడు చేసిన ఈ కన్ఫర్మేషన్‌తో బాలయ్య ఫ్యాన్స్‌కి ఎగిరే ఆనందం వచ్చింది. అఖండ యూనివర్స్‌లో ‘భక్త ప్రహ్లాదుడు’ పాత్ర ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలనే ఉత్కంఠ పెరిగింది.





