నందమూరి బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబో మరోసారి భారీ హిస్టారికల్ ఎపిక్ కోసం చేతులు కలిపారు. ‘Veera Simha Reddy’ తర్వాత వీరి కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు రెట్టింపు కావడంతో ఈ కొత్త సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోన్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
ఈ సినిమా NBK 111 పేరుతో హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. దర్శకుడు గోపిచంద్ మలినేని ఇప్పటివరకు యాక్షన్, మాస్ కోణంలోనే చిత్రాలు చేసినా.. ఈసారి తొలిసారిగా హిస్టారికల్ జానర్‌ను తెరకెక్కిస్తున్నారు. భారీ నిర్మాణం, రిచ్ విజువల్స్, గ్రాండ్ సెట్స్ ఈ చిత్రానికి ప్రత్యేకత కానున్నాయి.
Here she comes…
— Gopichandh Malineni (@megopichand) November 18, 2025
Welcoming the one and only Queen #Nayanthara garu into the world of #NBK111 🤗❤️
Honoured to have her power and grace in our story. Wishing you a wonderful Birthday. Excited to see you on set soon. ❤️❤️@nbk111movie
GOD OF MASSES #NandamuriBalaKrishna… pic.twitter.com/p2IVepbpa7
ఇప్పటికే బాలకృష్ణ-నయనతార జోడీ ‘Simha’, ‘Jai Simha’, ‘Sri Rama Rajyam’ సినిమాల్లో నటించారు. ఈ హిట్ జంట మరోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. నయనతార పాత్ర ఈసారి కూడా కథలో కీలకంగా ఉండబోతోందని సమాచారం.
‘Akhanda 2’ ప్రమోషన్స్ పూర్తయ్యాక బాలకృష్ణ NBK 111 షూట్‌లో పాల్గొననున్నారు. నిర్మాణ సంస్థ వెంకట సతీష్ కిలోరు ఈ సినిమాను సొంత బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
బాలయ్య-గోపిచంద్-నయనతార కాంబినేషన్, హిస్టారికల్ డ్రామా సెటప్, రిచ్ విజువల్స్.. ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీగా మారుస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది.





