HomeMovie News Teluguగ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో దేవుడిపై వ్యాఖ్యలు.. రాజమౌళిపై కేసు నమోదు!

గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో దేవుడిపై వ్యాఖ్యలు.. రాజమౌళిపై కేసు నమోదు!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేయడంతో పోలీసులు IPC 295A కింద కేసును నమోదు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తూ అభిమానులను అలరించిన రాజమౌళి, వారణాసి టైటిల్ లాంచ్ సమయంలో చిన్న టెక్నికల్ ఇష్యూ రావడంతో కాసేపు కార్యక్రమం నిలిచిపోయింది. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన రాజమౌళి, “అందుకే నేను దేవుడిని నమ్మను” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

అయితే రాజమౌళి అదే సమయంలో తన కుటుంబం దేవుడిపై ఉన్న భక్తిని కూడా వివరించారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ హనుమంతుడిపై గాఢ నమ్మకం ఉంచుతారని, తన భార్య రమకు ఆంజనేయస్వామిపై ప్రత్యేక భక్తి ఉందని చెప్పారు. కానీ ఈవెంట్‌లో జరిగిన టెక్నికల్ సమస్య కారణంగా తనకు కోపం వచ్చి ఆ మాటలు వచ్చాయని తెలిపారు.

ఇదిలా ఉండగా, రాజమౌళి సుమారు 15 సంవత్సరాల క్రితం రాముడిపై చేసిన ఓ పాత ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వివాదంతో రాజమౌళిపై కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular