నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ నుంచి తాజాగా విడుదలైన రెండో సింగిల్ ‘జాజికాయ జాజికాయ’ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి పాట ‘ది తాండవం’తో దేవీ శక్తి, భక్తి వైబ్‌ను అందించిన సంగీత దర్శకుడు థమన్, ఈసారి పూర్తి మాస్ ఫీలింగ్‌తో స్టెప్పులు వేయించే బీట్‌ను అందించారు. ‘జాజికాయ జాజికాయ’ లిరికల్ వీడియోను విశాఖపట్నం జగదాంబ థియేటర్లో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేయగా, విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాటలో బాలయ్య ఎనర్జీ అబ్బురపరుస్తూ, హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామర్ స్క్రీన్‌ను కట్టిపడేస్తుంది. వీరిద్దరి మీద భాను మాస్టర్ చేసిన మాస్ స్టెప్పులు అభిమానుల్లో పూనకాలు రేకెత్తిస్తున్నాయి. కాసర్ల శ్యామ్ పల్లెటూరి నేటివిటీతో, మాస్ ఎనర్జీని మిళితం చేస్తూ రాసిన సాహిత్యం పాటకు మరింత రంగురంగులతోంది. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ గాత్రం పాటను ఇంకా ఎత్తుకు తీసుకువెళ్లింది.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “థియేటర్లో కాలు కదపడమే కాదు-కుర్చీలు కంపించే బీట్ ఇది!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ రెండో సాంగ్‌తో ‘అఖండ 2’పై అంచనాలు మరింత పెరిగాయి.
రామ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి అఘోరా లుక్‌లో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్లలో రిలీజ్ కానుంది.





