టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన విజయ్, ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక పని అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.
‘ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)’ సినిమా సక్సెస్ మీట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన విజయ్ దేవరకొండ, అక్కడ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేతిపై కిస్ ఇచ్చారు. ఆ క్షణం అక్కడి వారిని షాక్‌కు గురి చేయగా, వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది.
Vijay Devarakonda kissing Rashmika Mandanna’s hand — the cutest moment on the internet today! 🥰💫#VijayDevarakonda #RashmikaMandanna #CutestPair #VijayRashmika #TheGirlFriend #girlfriend #rashmika pic.twitter.com/qq5fE1Ppwv
— 𝐕𝐢𝐠𝐧𝐞𝐬𝐡 🚩 (@vignesh__9) November 12, 2025
దీంతో అభిమానులు, “ఇద్దరి మధ్య రిలేషన్ కన్‌ఫర్మ్!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. “త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు” అని ఫ్యాన్స్ పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. గతంలో రష్మిక-విజయ్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తలు బయటకు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. కానీ రాజస్థాన్‌లో వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరగబోతుందనే టాక్ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇక ఈవెంట్‌లో రష్మిక కాస్త ఎమోషనల్ అయ్యారు. లైవ్ పర్ఫార్మెన్స్ సందర్భంగా కళ్లలో నీళ్లు కూడా వచ్చాయి. ఆమె ఈ ఎమోషనల్ మోమెంట్ ఫ్యాన్స్‌ను మరింత టచ్ చేసింది.
రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలై, మంచి కలెక్షన్లు సాధిస్తోంది.





